అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నియామకం

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నియామకం

13-08-2019

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ నియామకం

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది. ఈ నియామక పదవీకాలం రెండేళ్లుగా ఉంటుంది. మాజీ రాజ్యసభ సభ్యులు, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలుగు భాష అభివృద్ధికోసం కృషి చేస్తున్నారు, పరిపాలనలో తెలుగు భాషకు ఇతోధికంగా పెద్దపీట వేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భాషాభివద్ధి, పరిరక్షణ వంటి కార్యక్రమాలను యార్లగడ్డ పర్యవేక్షిస్తారు. తెలుగు హిందీ భాషల్లో పట్టభద్రులైన యార్లగడ్డ ఇప్పటి వరకు రెండు సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలతో పాటు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు టైమ్స్‌ ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తోంది. పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకు ఆయన హాజరై ఆశీస్సులను అందజేసిన సంగతి తెలిసిందే.