ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అక్టోబర్ 12వ తేదీన మిడ్ అట్లాంటిక్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తానా కార్యదర్శి రవి పొట్లూరి తెలిపారు. ఈ వేడుకలు కళాకారుల ప్రతిభకు అద్దంపట్టేలా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకల్లో ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట సంగీత విభావరి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఇతర వివరాలకు ఫ్లయర్ను చూడండి.