భారత-అమెరికా కృతజ్ఞతా దినోత్సవం
APEDB

భారత-అమెరికా కృతజ్ఞతా దినోత్సవం

17-03-2017

భారత-అమెరికా కృతజ్ఞతా దినోత్సవం

అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలో మార్చి 16న ఇండియన్‌ అమెరికన్‌ అప్రిసియేషన్‌ డే గా ప్రకటిస్తున్నట్లు  రాష్ట్ర గవర్నర్‌ శామ్‌ బ్రౌన్‌బ్యాక్‌ వెల్లడించారు. శ్వేతజాతీయుడి కాల్పుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై అటువంటి జాతివిద్వేష పూరిత దాడులు జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. భారతీయుల సమిష్టి కృషి వల్లే కాన్సాస్‌ ఉన్నతస్థానంలో ఉంది. అందుకు వారందరికీ ధన్యవాదాలు. ఇక్కడకు భారతీయులు ఎప్పుడూ ఆహ్వానితులే అని అన్నారు. భారతీయులపై దాడి జరుగుతున్న సమయంలో ప్రాణాలు తెగించి వారిని కాపాడేందుకు యత్నించిన శ్వేతజాతీయుడు ఇయాన్‌ గ్రిల్లెట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రిల్లెట్‌తో పాటు ఆ దాడిలో గాయపడినన మదసాని అలోక్‌ కూడా హాజరయ్యారు.