హైదరాబాద్‌లో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌

హైదరాబాద్‌లో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌

22-08-2019

హైదరాబాద్‌లో అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సంస్థ నెలకొల్పిన అతి పెద్ద క్యాంపస్‌ భవనాన్ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్‌ అలీ ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, అమెజాన్‌ గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ ఫెసిలిటీస్‌ డైరెక్టర్‌ జాన్‌ స్కోట్లర్‌ పాల్గొన్నారు. ఈ-కామర్స్‌ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్‌ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్‌రామ్‌ గూడలో ఏర్పాటు చేసింది. కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి మాట్లాడుతూ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌ తెలంగాణలోనే అతిపెద్ద బిల్డింగ్‌ కావడం విశేషమని, ఇది మనకు గర్వకారణమని అన్నారు. అమెజాన్‌ ఇండియా మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ 9.5 ఎకరాల్లో విస్తరించిన అమెజాన్‌ క్యాంపస్‌లో సుమారు 15 వేల మంది పనిచేయనున్నారని వివరించారు.