రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గాయి : ట్రంప్‌

రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గాయి : ట్రంప్‌

10-09-2019

రెండు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గాయి : ట్రంప్‌

గతంతో పోలిస్తే గడిచిన రెండు వారాలుగా భారత్‌-పాక్‌ మధ్య ఉద్రికత్తలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ మరోసారి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్‌ అంశంలో భారత్‌-పాక్‌ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో భారత ప్రభుత్వం కశ్మీర్‌ స్వయం ప్రతిపతి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కశ్మీర్‌ విభజన అనంతరం నేను ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడాను. సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాను. గత రెండు వారాల నుంచి ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. భారత్‌-పాక్‌ కోరుకుంటే కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక దీని గురించి వారే ఆలోచించుకోవాలి అని తెలిపారు.