పుతిన్‌ ఆఫీసులో అమెరికా గూఢచారి!

పుతిన్‌ ఆఫీసులో అమెరికా గూఢచారి!

11-09-2019

పుతిన్‌ ఆఫీసులో అమెరికా గూఢచారి!

మూడేండ్ల కిందట జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రత్యక్ష ప్రేమయం ఉన్నదని వెల్లడించిన తమ గూఢచారిని (రష్యా ప్రభుత్వ ఉన్నతాధికారి) అమెరికా.. రష్యా నుంచి తప్పించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆ గూఢచారి కొన్నేండ్లుగా పుతిన్‌ ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ల చిత్రాలను అమెరికా నిఘా అధికారులకు చేరవేశారని సీఎన్‌ఎన్‌ మీడియా సంస్థ తెలిపింది. అయితే అతడిని రష్యా నుంచి తప్పించినట్టు సీఎన్‌ఎస్‌తో పాటు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాలు ప్రచురించాయి.

అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉన్నదని అధికారులు వెల్లడించిన తర్వాత మీడియా కంటపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో 2016 చివరిలోనే అతడిని తీసుకురావాలని అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ భావించిందని, అయితే ఆ గూఢచారి అందుకు నిరాకరించాడని ది టైమ్స్‌ పేర్కొంది. అనంతరం కొన్ని నెలల తర్వాత అతడు అంగీకరించాడని తెలిపింది. దీంతో 2017లో అతడిని తీసుకొచ్చేసినట్టు సీఎన్‌ఎస్‌ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను శ్వేతసౌధం ఖండించింది.