అమెరికాతో సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి

అమెరికాతో సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి

18-09-2019

అమెరికాతో సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి

భారత్‌, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆరోగ్యకరంగానే ఉన్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జయశంకర్‌ పేర్కొన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారత్‌, అమెరికాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన విభేదాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన విభిన్నంగా సమాధానం ఇచ్చారు. భారత్‌, అమెరికాల సంబంధాలు ఒక గ్లాసు అనుకుంటే, అందులో 90 శాతం నిండుగా (బాగానే) ఉంది, 10 శాతం (చిన్నచిన్న విభేదాలు) మాత్రమే ఖాళీగా ఉంది అని పేర్కొన్నారు.

హోస్టన్‌లో జరగనున్న హౌదీ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా పాల్గొంటారని అన్నారు. ఎక్కడైనా ఇరుపక్షాల మద్య స్వల్ప విభేదాలు ఉంటాయని, అలాగే భారత్‌, అమెరికాల మద్య చిన్నపాటి వాణిజ్య సమస్యలు కూడా సాధారణమని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి ఇరుదేశాల కృషి చేస్తున్నాయని అన్నారు. హౌడీ మోదీ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొనున్నారని తెలిపారు.