అమెరికా కోర్టులో అనిల్‌ అంబానీ

అమెరికా కోర్టులో అనిల్‌ అంబానీ

18-09-2019

అమెరికా కోర్టులో అనిల్‌ అంబానీ

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అనుబంధ సంస్థ గ్లోబల్‌ క్లౌడ్‌ ఎక్స్ఛేంజ్‌ (జిసిఎక్స్‌) లిమిటెడ్‌ దివాలా కోసం అమెరికా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అంటే అనిల్‌ అంబానీ యాజమాన్యంలోని మరో సంస్థ త్వరలో దివాళా తీసే అవకాశముంది. ఇది అనిల్‌ అంబానీ కష్టాలను మరింత పెంచింది. ఈ సంస్థ 350 మిలియన్‌ డాలర్లను చెల్లించలేదు. కంపెనీ విఫలమైన తరువాత ఈ చర్య తీసుకుంది. ఈ కారణంగా క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ కూడా కంపెనీ రేటింగ్‌ను తగ్గించింది.