న్యూజెర్సితో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం

న్యూజెర్సితో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం

18-09-2019

న్యూజెర్సితో సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందం

న్యూజెర్సి రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్ర సిస్టర్‌ స్టేట్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విద్యా - వ్యాపార - వాణిజ్య - పారిశ్రామిక రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరు రాష్ట్రాలు ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ మేరకు న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌ మార్ఫి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషిలు ఒప్పందాలు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో న్యూజెర్సి గవర్నర్‌ మాట్లాడుతూ, తెలంగాణలో వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, తెలుగువారు ఎక్కువగా ఉండే రాష్ట్రం న్యూజెర్సి అని చెప్పారు. ఐటి, ఫార్మా లైప్‌ సైన్సెస్‌, బయోటెక్‌, ఫిన్‌ టెక్‌, డాటా సెంటర్స్‌, క్లీన్‌ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో ఇరు రాష్ట్రాలు సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోతామని తెలిపారు.

ఈ సమావేశంలో స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, హైదరాబాద్‌ అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ అధికారులు పాల్గోన్నారు.