అమెరికా చెస్‌లో దేవేశ్‌ మామిడికి స్వర్ణం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

అమెరికా చెస్‌లో దేవేశ్‌ మామిడికి స్వర్ణం

18-03-2017

అమెరికా చెస్‌లో దేవేశ్‌ మామిడికి స్వర్ణం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెస్‌ చిన్నారి దేవేశ్‌ మామిడి అమెరికాలో జరిగిన టోర్నమెంట్లో సత్తా చాటాడు. కాలిఫోర్నియాలో జరిగిన  అమెరికా సూపర్‌ స్టేట్‌ చెస్‌ ఈవెంట్‌లో దేవేశ్‌ చాంపియన్‌గా నిలిచాడు. బాలుర అండర్‌-10 కేటగిరిలో దేవేశ్‌ అందరి  కంటే అత్యధిక పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడని అతని తల్లి భవాన్ని  తెలిపారు. ఈ టోర్నమెంట్లో సత్తాచాటడంతో అమెరికాలోని నాష్‌విల్లేలో మే 12 నుంచి జరిగే జాతీయ స్టేట్‌ చెస్‌ టోర్నమెంట్‌కు దేవేశ్‌ ఎంపికయ్యాడు.