తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ సంబురం

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ సంబురం

09-10-2019

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ సంబురం

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఇక్కడి సంబవాంగ్ పార్క్  లో అక్టోబర్ 05 న ఎంతో కన్నుల పండుగ గా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా అనే లేకుండా అందరు జోరైన పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి మరియు ఈ  సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 1000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ మరియు స్థానికులకు  బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు సుమారు గత పది సంవత్సరాలుగా పండుగ కు విశేష ఆదరణ కలుగజేయడం ద్వార TCSS చరిత్రలో నిలిచిపోవడం జరిగిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు ఎన్‌ఆర్‌ఈ  ఫ్యాషన్స్ వారు బహుమతులు అందజేశారు. 

ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని మరియు సంబరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరు న టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవుల లు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ యేడు బతుకమ్మ సంబురాలకు సమన్వయ కర్తలుగా గోనె రజిత, నల్ల దీప, కల్వ నికిత, నంగునూరి సౌజన్య, గర్రేపల్లి కస్తూరి, బసిక అనిత రెడ్డి, తోట గంగాధర్, మారుతి, శ్రీధర్ పోచంపల్లి  మరియు సాయిరాం మంత్రి మొదలగువారు వ్యవహరించారు.

స్పాన్సర్స్ గురు అకాడమి, ఆర్కా మీడియా, వేలన్ ట్రేడర్స్, ఎన్‌ఆర్‌ఈ ఫ్యాషన్స్, మలబార్ గోల్డ్ & డైమండ్స్, టింకర్ టోట్స్, ఆర్‌జి‌జి స్టోర్స్, చింతకింది రమేశ్, ముదం అశోక్, రవీందర్ గుజ్జుల, హేమ సుభాష్ రెడ్డి, ముద్దం విజ్జేందర్, సతీష్ శివనాథుల నంగునూరి సౌజన్య రమణ, గర్రేపల్లి శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, నందగిరి శిల్పా అజయ్ మరియు ఇతర దాతలకు లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Click here for Event Gallery