ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి

11-10-2019

ఇథియోపియా ప్రధానికి నోబెల్‌ శాంతి

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ను వరించింది. ఇథియోపియా, ఎరిత్రియాల మధ్య 20 ఏళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించడంలో అబీ చేసిన కృషికిగాను నోబెల్‌ అవార్డు కమిటీ ఆయన పేరును ప్రకటించింది. తీవ్ర రక్తపాతాన్ని అపార ధన నష్టాన్ని ఈ రెండు దేశాలు చవిచూశాయి. 2018లో ఇథియోపియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అబీ.. ఆ వెంటనే ఎరిత్రియా అధ్యక్షుడు అవెరికితో చర్చలు ప్రారంభించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు.