టర్కీపై కఠిన ఆంక్షలు విధిస్తాం : ట్రంప్‌

టర్కీపై కఠిన ఆంక్షలు విధిస్తాం : ట్రంప్‌

16-10-2019

టర్కీపై కఠిన ఆంక్షలు విధిస్తాం : ట్రంప్‌

ఉత్తర సిరియాపై దాడులకు పాల్పడిన టర్కీని తీవ్రంగా దెబ్బతీస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. టర్కీ ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా ధ్వంసం చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆ దేశ మంత్రులు, సీనియర్‌ అధికారులపై ఆంక్షలు విధించామని తెలిపారు. స్టీల్‌ టారిఫ్‌లు పెంచుతామని, టర్కీతో 100 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ఒప్పందంపై సాగుతున్న చర్యలను రద్దు చేస్తామని చెప్పారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడిన ట్రంప్‌ వెంటనే సంధికి రావాలని డిమాండ్‌ చేశారు. సరిహద్దుల్లో పొంచి ఉన్న కుర్దిష్‌ సేవలను తరిమికొట్టేందుకు టర్కీ సైన్యం ఇటీవల ఉత్తర సిరియాలో దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో పౌరులు మరణించడం అమెరికాకు ఆగ్రహాన్ని కలిగించింది.