137 ఏళ్ల రికార్డు బద్దలు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

137 ఏళ్ల రికార్డు బద్దలు

18-03-2017

137 ఏళ్ల రికార్డు బద్దలు

2017 ఫిబ్రవరి నెల అత్యంత చల్లని నెలగా రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో 137 ఏళ్ల రికార్డు బద్దలైంది. 137 ఏళ్లు తరువాత అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఫిబ్రవరిలోనే నమోదయ్యాయని నాసాకు చెందిన గొడార్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ స్టడీస్‌ వెల్లడించింది. 1951-1980 కాలంలో ఫిబ్రవరి నెలల కంటే 1.1 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు ఈ ఫిబ్రవరిలో నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన 1.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైందని, ఇప్పుడు సరాసరి ఉష్ణోగ్రతలు 0.20 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయని సంస్థ తెలియజేసింది.