న్యూజిలాండ్‌లో మొక్కలు నాటిన ఎన్‌ఆర్‌ఐలు

న్యూజిలాండ్‌లో మొక్కలు నాటిన ఎన్‌ఆర్‌ఐలు

21-10-2019

న్యూజిలాండ్‌లో మొక్కలు నాటిన ఎన్‌ఆర్‌ఐలు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్‌ఎస్‌ న్యూజిలాండ్‌ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి కొసన మొక్కలు నాటారు. టిఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేష్‌బిగాలా విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌కు స్పందించి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ, గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి న్యూజీలాండ్‌లో మొక్కలు నాటుతున్నామన్నారు. సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో తెలంగాణలో మూడు కోట్లకు పైగా మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకుని మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణాన్ని పరిరక్షించి తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం త్వరలో 10 కోట్ల మొక్కల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌రావు కాసుగంటి, టిఆర్‌ఎస్‌ న్యూజీలాండ్‌ జనరల్‌ సెక్రటరీ నర్సింగరావు ఇనగంటి, ఉమెన్స్‌ అఫైర్స్‌ చైర్‌ పర్సన్‌ సునీత విజయ్‌, మెంబర్షిప్‌ ఇంచార్జీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.