భారత్‌-అమెరికాలది బలమైన బంధం

భారత్‌-అమెరికాలది బలమైన బంధం

22-10-2019

భారత్‌-అమెరికాలది బలమైన బంధం

భారత్‌, అమెరికాల మధ్య బలమైన బంధం ఉందని, ఎలాంటి అవరోధాలనైనా అధిగమిస్తాయని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య పరంగా కొన్ని సమస్యలు రావచ్చని భావిస్తున్న తరుణంలో విదేశాంగమంత్రి ఈ వ్యాఖ్య చేశారు. అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరంలో మాట్లాడుతూ జైశంకర్‌... అమెరికా తన విదేశాంగ విధానానికి అనుగుణంగా వాణిజ్య వ్యవహారాల్ని రూపొందించుకుంది. అందువల్ల కొన్ని అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కానీ నేడు భారత్‌-అమెరికా సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఏ ఆటంకం ఎదురైనా రెండు దేశాల బంధాన్ని ఏమీ చేయలేదు అని సృష్టం చేశారు. సమస్యల్ని అధిగమించి, రెండు దేశాలమధ్య వాణిజ్యాభివృద్ధికి ఒక ప్యాకేజీ కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్న తరుణంలో జై శంకర్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి.