బుద్ధవనాన్ని సందర్శించిన విదేశీయులు

బుద్ధవనాన్ని సందర్శించిన విదేశీయులు

22-10-2019

బుద్ధవనాన్ని సందర్శించిన విదేశీయులు

ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జుసాగర్‌లో అంతర్జాతీయ స్థాయిలో హిల్‌కాలనీలో నిర్మితమవుతున్న శ్రీ పర్వతారామం (బుద్ధవనం)ను తైవాన్‌, మలేషియాకు చెందిన 35 మంది బౌద్ధగురువు హూక్షియాన్‌ ఆధ్వర్యంలో సందర్శించారు. శ్రీపర్వతారామంలోని గౌతమబుద్ధుడి పాదాలకు పూలు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం బుద్ధవనంలోని మ్యూజియం, గోపురంపై అమర్చిన శిల్పాలతో పాటు స్థూపపార్కు, ధ్యానవనం, బుద్ధచరిత వనం, మహాస్థూపపార్కు, మహాబుద్ధస్థూపం ప్రాంతాలను సందర్శించారు. బుద్ధవనంలోని ఎత్తయిన గౌతమబుద్ధుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. వీరితో పాటు బుద్ధవనం ప్రాజెక్ట్‌ ఏఈ జగదీశ్‌ తదితరులు ఉన్నారు.