వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు

వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు

22-10-2019

వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం (24వ తేదీ) వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు. భారత్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యే దానికంటే మూడు రోజుల ముందే ట్రంప్‌ దీపావళి జరుపుకోవడం విశేషం. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైన తర్వాత దీపావళి వేడుకలు జరుపుకోనుండడం ఇది మూడోసారి. భారత సంతతి అమెరికా నేతలతో కలిసి ట్రంప్‌ తొలిసారి 2017లో వైట్‌ హౌస్‌లోని ఓవల్‌ ఆఫీసులో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్‌ సింగ్‌ సర్నాను ట్రంప్‌ ఆహ్వానించారు. 2009లో నాటి అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు ప్రారంభించారు.