అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా సేవలందిస్తున్న రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ కంపాస్ హైదరాబాద్‌లో టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేయన్ను ఈ కేంద్రంలో తొలి దశలో 200 మంది ఇంజనీరింగ్, ప్రాడక్ట్ అండ్ డిజైన్ నిపుణులను నియమించుకోనుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు సాఫ్ట్వేర్ సేవలను అందించే కంపాస్‌ను అమెరికా బటయ తొలి టెక్నాలజీ హబ్ ఇదే. ఈ కేంద్రం ప్రధానంగా రియల్టీ టెక్నాలజీ మొబైల్ అప్లికేషన్స్ మీద ఈ కేంద్రం పని చేస్తుందని, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత రికమండేషన్స్, సీఆర్ఎం, సెర్చ్ వంటి టెక్నాలజీ భాగాల్లో పరిశోధనలు సాగుతాయని కంపాస్ సీటీఓ జోసెఫ్ సిరోష్ తెలిపారు.