భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్‌ 1 బీ షాక్‌

భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్‌ 1 బీ షాక్‌

07-11-2019

భారతీయ ఐటీ కంపెనీలకు హెచ్‌ 1 బీ షాక్‌

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమిగ్రేషన్‌ విధానాల్లో తీసుకొచ్చిన మార్పులు భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. హెచ్‌-1 బీ వీసా దరఖాస్తులు భారీగా తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏపీ) గణాంకాలతో సహా వివరించింది. యూఎస్‌ సిటిజన్‌ షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఆధారంగా విషయాలను వెల్లడించింది. వీసా తిరస్కరణ ప్రభావం భారతీయ కంపెనీలపై అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలు అవసరాలకు తగ్గట్టూ టార్గెట్‌ ప్రకారం ఉద్యోగులను నియమించుకోవడంపై నమ్మకాలు సన్నగిల్లాయి. టెక్‌ మహీంద్రా తిరస్కరణ రేటు 4 శాతం నుంచి 41కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ రేటు 6 శాతం నుంచి 34కి, విప్రో 7శాతం నుంచి 53 శాతానికి, ఇన్ఫోసిస్‌ 2 శాతం నుంచి 45 శాతానికి తిరస్కరణ రేటు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. ఇతర అమెరికా కంపెనీలకు ఉద్యోగాలు లేదా ఐటీ సేవలను అందించే యాక్సెంచర్‌, కాప్‌ జెమినితో పాటు కనీసం 12 కంపెనీల హెచ్‌-1 బీ వీసా తిరస్కరణ రేటు మొదటి మూడవ త్రైమాసికాల్లో 30 శాతానికి పైగానే ఉంది.