వర్జీనియా సెనెటర్‌గా హైదరాబాదీ హష్మీ

వర్జీనియా సెనెటర్‌గా హైదరాబాదీ హష్మీ

08-11-2019

వర్జీనియా సెనెటర్‌గా హైదరాబాదీ హష్మీ

అగ్రరాజ్యం అమెరికాలో హైదరాబాద్‌ మహిళ గజాల హష్మీ చరిత్ర సృష్టించారు. అక్కడి వర్జీనీయ రాష్ట్రంలోని టెన్త్‌ సెనేట్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ తరపున సెనేటర్‌గా ఆమె గెలుపొందారు. రిపబ్లికన్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ సెనేటర్‌ గ్లెన్‌ స్టర్టెవాంట్‌ను గజాలా హష్మీ ఓడించడం విశేషం. ఈ విజయంతో వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి మహిళా ముస్లిం-అమెరికన్‌గా, తొలి ఇండియన్‌- అమెరికన్‌గా హష్మీ రికార్డులకెక్కారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఐజా ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆమె.. దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లారు. జార్జియా వర్సిటీ నుంచి బీఏ ఇంగ్లిష్‌ చదివారు. అనంతరం పీహెచ్‌డీ చేశారు.

హైదరాబాద్‌లో చదువుకునేటపుడు సహ విద్యార్థులు అమెను మున్నీగా పిలిచేశారు. ఆమెకు భర్త, ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతల్లో శ్వేతసౌధ మాజీ సాంకేతిక విధాన సలహాదారు సుహాన్‌ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆయన వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాలోని శాన్‌ప్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌ కార్యాలయ సభ్యుడిగా మనోరాజు, ఉత్తర కరోలినా షా ర్లెట్‌ మండలి సభ్యురాలిగా డింపుల్‌ అజ్మీరా గెలిచారు.