హెచ్‌-4 వీసాదారులకు ఊరట

హెచ్‌-4 వీసాదారులకు ఊరట

11-11-2019

హెచ్‌-4 వీసాదారులకు  ఊరట

అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఊరట లభించింది. హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో పనిచేసుకొనేందుకు కొలంబియా సర్క్యూట్‌ కోర్టు అనుమతినిచ్చింది. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్‌-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ వీసా కలిగిన ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తూ, వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ విధానం భారతీయలకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులు రద్దు చేశారు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ కొలంబియా సర్క్యూట్స్‌లో దాఖలైన వ్యాజ్యాలను విచారణ జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు త్రిసభ ధర్మాసనం ప్రకటించింబది. ఈ కేసులో తీసుకున్న నిర్ణయాన్ని పున పరిశీలించుకోవాలని దిగువ కోర్టులకు సూచించింది. దీంతో హెచ్‌-4 వీసాదారులకు పని అనుమతులను పునరుద్ధరించినట్టయింది. అమెరికాలో 1.2 లక్షల మంది హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు చేస్తున్నట్టు అంచనా.