న్యూజెర్సీలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ లో ఎంపీ రేవంత్‌రెడ్డి

న్యూజెర్సీలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ లో ఎంపీ రేవంత్‌రెడ్డి

12-11-2019

న్యూజెర్సీలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ లో ఎంపీ రేవంత్‌రెడ్డి

తెలంగాణలో పరిస్థితులు గమనిస్తుంటే అంతర్గత యుద్ధం వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాజకీయాలకు ఎక్కడ లేని కళంకం తెచ్చారని విమర్శించారు. ఇలాంటి తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ తప్పిదాల వల్లే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తులో అలాంటి తప్పిదాలు జరగకూడదని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి న్యూజెర్సీలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ లో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని దోపిడీకి తెర తీశారని ఆరోపించారు.