జిమ్మీ కార్టర్‌ ఆరోగ్యం విషమం

జిమ్మీ కార్టర్‌ ఆరోగ్యం విషమం

13-11-2019

జిమ్మీ కార్టర్‌ ఆరోగ్యం విషమం

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ (95) ఆరోగ్యం విషమంగా ఉన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్టర్‌ మెదడు తీవ్ర ఒత్తిడికి గురువుతుండటంతో ఆయన్ను అట్లాంటా ఆస్పత్రిలో చేర్పించామని అన్నారు. కార్టర్‌కు శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. అనారోగ్య కారణాల దృష్ట్యా గత నెలలో ఆయన్ను ఎమోరీ వర్సిటీ ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు చికిత్స పొందిన తర్వాత గత వారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మళ్లీ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన అట్లాంటా ఆస్పత్రికి తరలించినట్టు భార్య రోస్లిన్‌ తెలిపారు. ఈ ఏడాది మే నెలలో ప్రమాదవశాత్తూ కాలు జారిపడటంతో ఆయన నడుము భాగంలోని ఎముకలు విరిగాయి. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రోసలిన్‌ తెలిపారు.