కెనడా ఆల్బర్టా కాల్గరీ లో కార్తీక పౌర్ణమి వేడుకలు

కెనడా ఆల్బర్టా కాల్గరీ లో కార్తీక పౌర్ణమి వేడుకలు

14-11-2019

కెనడా ఆల్బర్టా కాల్గరీ లో కార్తీక పౌర్ణమి వేడుకలు

కెనడా ఆల్బర్టా కాల్గరీ లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాల్గరీ లోని శ్రీ అనగా దత్త సొసైటీ సాయి బాబా మందిరం కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకున అత్యంత వైభవంగా సహస్ర దీపాలతో కనుల విందుగా ఎంతో భక్తి శ్రద్దలతో అలంకరించడం జరిగింది. దేవాలయ ప్రధాన అర్చకులు రాజకుమార్‌ శర్మ, కార్తీక పౌర్ణమి విశిష్టతను చక్కగా వివరించారు.  సుమారు  400  మందికి పైగా భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ శివ అభిషేకం, శ్రీ సత్యనారాయణ స్వామి గారి   వ్రతం వేద నిష్టతో చేశారు. సాంస్క తిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించారు. అందరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మన సంస్కృతిని చాటి చెప్పేలా వేడుకలను నిర్వహించిన శ్రీమతి లలిత, శైలేష్‌, రాజకుమార్‌ శర్మ ఇతర వలంటీర్లు పాల్గొని చేసిన క షిని అందరూ అభినందించారు.