ఫేస్‌బుక్‌ పే సేవలు షురూ...

ఫేస్‌బుక్‌ పే సేవలు షురూ...

14-11-2019

ఫేస్‌బుక్‌ పే సేవలు షురూ...

ఫేస్‌బుక్‌ చెల్లింపు సేవల ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ పే ను ప్రకటించింది. అమెరికాలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా అనుబంధ యాప్‌లు అయిన మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ల్లో సైతం చెల్లింపులు చేయొచ్చు. ఈ ఏడాది చివర్లో వాట్సాప్‌ సైతం ఇదే విధమైన చెల్లింపు సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ పేను వినియోగించాలంటే ముందుగా ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ ఫేస్‌బుక్‌ పే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్‌ విధానాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. అధిక శాతం డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులను వినియోగించి చెల్లింపులు చేయొచ్చు. పేపాల్‌, స్ట్రైప్‌ వంట చెల్లింపు ప్లాట్‌ఫామ్‌లు సైతం ఉన్నాయి.కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, లావాదేవీలు సైతం చేయొచ్చు.