హైదరాబాద్‌లో ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్చేంజీ

హైదరాబాద్‌లో ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్చేంజీ

14-11-2019

హైదరాబాద్‌లో ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్చేంజీ

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ మాతృ సంస్థ ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్చేంజీ 500 మంది సిబ్బందితో హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. భారత కార్యాకలాపాలకు ఇదే కేంద్ర స్థానంగా ఉంటుందని ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్చేంజీ ప్రెసిడెంట్‌ బెంజమిన్‌ జాక్సన్‌ వెల్లడించారు. పలు రకాలైన సమచార సేవలు అందించేలా హైదరాబాద్‌ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణుల లభ్యత, మంచి సదుపాయాలు ఉండటంతో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని నెలకొల్పాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. గచ్చీబౌలిలోని స్కైవ్యూ ప్రాంగణంలో 85,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇంజనీర్లు, కామర్స్‌ పట్టభద్రులు, డేటా సైంటిస్టులను ఉద్యోగులుగా తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు, స్టాక్‌ మార్కెట్లు, బాండ్‌ మార్కెట్లకు సంబంధించిన సమచారాన్ని విశ్లేషించి తన వినియోగదార్లకు అందించటం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది. భారతీయ కార్యకలాపాల అధిపతిగా సచి పాటి వ్యవహరిస్తారు. హైదరాబాద్‌ కేంద్రంలో త్వరలో మరో 250 మంది సిబ్బందిని తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. హైస్పీడ్‌ కనెక్టివిటీ, వీడియో కాన్ఫెరెన్సింగ్‌, అధిక సమాచారాన్ని ప్రాపెస్‌ చేయగల కంప్యూటర్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.