కాశ్మీర్‌ లేకుండా భారత్‌ లేదు

కాశ్మీర్‌ లేకుండా భారత్‌ లేదు

16-11-2019

కాశ్మీర్‌ లేకుండా భారత్‌ లేదు

వాషింగ్టన్‌ వేదికగా మానవహక్కుల మీద జరుగుతున్న యూఎస్‌ కాంగ్రెషనల్‌ సమావేశాల్లో భారత్‌ తరపున ప్రముఖ కాలమిస్ట్‌ సునందా వశిష్ట్‌ పాల్గొన్నారు. కాశ్మీర్‌ జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఈ సందర్భంగా ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆమె ఏమన్నారంటే.. ఒకప్పుడు పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు ఎదురై మానవ హక్కులకు విఘాతం కలిగింది. అప్పుడు దాన్ని సమర్థంగా నియంత్రించాం. ఇప్పుడు ఉగ్రవాదమనే తిరుగుబాటుపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దీంట్లో భారత్‌ను బలపర్చాల్సిన సమయం వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో మద్దతు అవసరమని ఆమె అన్నారు.