అమెరికా రక్షణ మంత్రితో రాజనాథ్‌ సింగ్‌ భేటీ

అమెరికా రక్షణ మంత్రితో రాజనాథ్‌ సింగ్‌ భేటీ

18-11-2019

అమెరికా రక్షణ మంత్రితో రాజనాథ్‌ సింగ్‌ భేటీ

ఆసియాన్‌ దేశాల మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయా దేశాల మంత్రులతో భేటీ అయ్యారు. అమెరికా రక్షణ మంత్రి మార్క్‌ టీ ఎస్పర్‌తో జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితి, భారత్‌, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ రంగంలో సహకారంపై చర్చించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ ఉండాలని, ఈ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వ, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని భారత్‌ కోరుకుంటున్నదని ఎస్సర్‌తో రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సైనిక విస్తరణకు పాల్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.