తానా మహాసభలో ఆకర్షించనున్న ఎన్టీఆర్ ఎగ్జిబిషన్

తానా మహాసభలో ఆకర్షించనున్న ఎన్టీఆర్ ఎగ్జిబిషన్

26-05-2017

తానా మహాసభలో ఆకర్షించనున్న ఎన్టీఆర్ ఎగ్జిబిషన్

ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లోని అరుదైన ఫోటోలతో సెయింట్‌లూయిస్‌ నగరంలో జరుగుతున్న తానా మహాసభల్లో ఎన్టీఆర్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. తానా సభల సాంస్కృతిక విభాగం చైర్‌పర్సన్‌ వింజమూరి సుజాత ఈ విషయాన్ని తెలుపుతూ, ఎన్టీఆర్‌ ఛాయాచిత్రాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ స్టాల్‌ ఏర్పాట్లను తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, చలపతి కొండ్రకుంట, కేసి చేకూరి, సతీష్‌ వేమూరి, వినయ్‌ పరుచూరి తదితరులు చూశారు.