న్యూజిలాండ్‌లో అంగరంగ వైభవంగా తెలుగు సాహితీ సదస్సు

న్యూజిలాండ్‌లో అంగరంగ వైభవంగా తెలుగు సాహితీ సదస్సు

18-11-2019

న్యూజిలాండ్‌లో అంగరంగ వైభవంగా తెలుగు సాహితీ సదస్సు

ఆంగ్లభాషను నేర్చుకొని ఆదరించండి. కానీ తెలుగును ఎన్నటికీ మరచిపోకండి అని ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. న్యూజిలాండ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అక్కడి ఆక్లండ్‌లో మొదటి సాహితీసదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల వ్యామోహంలో పడి ఆ పదాలనే తెలుగులో వాడటం వల్ల మన భాష ఉనికి దెబ్బతింటుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎన్నో సేవలను ఇప్పుడు ఆంగ్ల పరిభాషలో వాడుతున్నారని, శ్రీవారి పదసేవను ఎస్‌వీపీగా మార్చారని, దీంతో ఆసలు అర్థాన్నే మరిచిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అతిథిగా హాజరైన నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ ప్రపంచభాషల్లో మేటిగా తెలుగు ఎదిగిందని చెప్పడానికి ఈ సదస్సు ఓ సంకేతమని అభివర్ణించారు. గౌరవ అతిథిగా పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ఎస్వీ సత్యనారాయణ హాజరయ్యారు. సదస్సులో ఆస్ట్రేలియా, మారిషస్‌, న్యూజిలాండ్‌ దేశాల నుంచి పలువురు తెలుగు సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఆయా దేశాల్లోని తెలుగు బడుల్లో తెలుగు బోధిస్తున్న ఉపాధ్యాయులను నిర్వాహకులు సత్కరించారు.

Click here for Event Gallery