అమెరికా నేషనల్‌ పోట్రెయిట్‌ గాలరీలో ఇంద్రానూయికి స్థానం

అమెరికా నేషనల్‌ పోట్రెయిట్‌ గాలరీలో ఇంద్రానూయికి స్థానం

18-11-2019

అమెరికా నేషనల్‌ పోట్రెయిట్‌ గాలరీలో ఇంద్రానూయికి స్థానం

మహిళలు తమని తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించుకోవద్దని ప్రముఖ వాణిజ్యవేత్త, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి పిలుపునిచ్చారు. నేడు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి పనిచేసే వారికి పుట్టిన పాంత్రం, వారి సంస్కృతితో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయని తెలిపారు. అమెరికాలోని ప్రముఖ నేషనల్‌ పొట్రెయిట్‌ గ్యాలరీ లో ఆమెకు స్థానం కల్పించిన సందర్భంగా నిర్వహించిన వేడుకలో ఇంద్రా నూయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమెతో పాటు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, ఫ్రాన్సెస్‌ అర్నాల్డ్‌ సహా మరికొంత మంది ప్రముఖులకు గాలరీలో చోటు దక్కింది.

ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిచెల్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌ లాంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తనకు ఈ గౌరవం ఇవ్వడం ద్వారా మహిళలు తమ భవిష్యత్తు నిర్మించుకోవడానికి అమెరికా గొప్ప దేశం అన్న సందేశం ఇచ్చారని నూయి పేర్కొన్నారు. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలు ఒక మేల్కొల్పు లాంటిందన్నారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే వారికి ఎప్పటికి సరైన గౌరవం లభిస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. అమెరికా నిర్మాణం, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారికి నేషనల్‌ పోట్రెయిల్‌ గ్యాలరీ లో స్థానం కల్పిస్తారు.