డెమొక్రాట్లకు ఒరాక్‌ ఒబామా సూచన

డెమొక్రాట్లకు ఒరాక్‌ ఒబామా సూచన

19-11-2019

డెమొక్రాట్లకు ఒరాక్‌ ఒబామా సూచన

రానున్న అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో అతివాద భావజాలమున్న వారికి ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా డెమొక్రాటిక్‌ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సూచన చేశారు. అయితే నిర్దిష్టమైన అభ్యర్థి లేదా విధాన ప్రతిపాదన వంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు. వామపక్షభావజాలం కొంతమేరకు వున్న వ్యక్తిని డెమొక్రాట్స్‌తో పాటు ఇండిపెండెంట్లు, మితవాద రిపబ్లికన్‌ ఓటర్లు సమర్థించే అవకాశం వుందని ఆయన అన్నారు. ట్విట్టర్‌ ఫిడ్‌లలో లేదా పార్టీ కార్యకలాపాలలో ఆయన వామపక్ష భావజాలం మరీ సృష్టంగా కన్పించకుండా వుంటే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. డెమొక్రాటిక్‌ అభ్యర్థిత్వ ఆశావహులు మరీ వామపక్ష భావజాలం వైపు మొగ్గుచూపుతున్నారన్న హెచ్చరికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు ఈ సందేశాన్ని పంపినట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.