సత్య నాదేళ్లకు అరుదైన గౌరవం

సత్య నాదేళ్లకు అరుదైన గౌరవం

21-11-2019

సత్య నాదేళ్లకు అరుదైన గౌరవం

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్లకి మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ 2019 సంవత్సరానికి గాను మేటి వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేసింది. తెలుగువాడు, మైక్రోసాఫ్ట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సత్య నాదెళ్లకు ఈ లిస్ట్‌లో అగ్రస్థానం దక్కింది. మాస్టర్‌ కార్డ్‌ సారథి అజయ్‌ బంగాతోపాటు అరిస్టా నెట్‌వర్క్స్‌ చీఫ్‌ జయశ్రీ ఉల్లాల్‌కు ఇందులో చోటు లభించింది. అజయ్‌ బంగా 8, జయశ్రీ ఉల్లాల్‌ 18వ స్థానంలో ఉన్నారు. తమ వ్యాపారాల్లో సాహసోపేతమైన లక్ష్యాలను సాధించడంతో పాటు అసాధ్యమైన ఇబ్బందులను అధిగమించిన, క్లిష్టమైన సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు చూపగలిగిన 20 మంది వ్యాపారవేత్తలతో ఫార్చ్యూన్‌ ఈ జాబితాను రూపొందించింది. మొత్తం 10 ఆర్థిక అంశాల ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు మ్యాగజైన్‌ తన నివేదికలో వెల్లడించింది.