హైదరాబాద్‌లో అమెరికా కేన్సర్‌ ఆస్పత్రి

హైదరాబాద్‌లో అమెరికా కేన్సర్‌ ఆస్పత్రి

21-11-2019

హైదరాబాద్‌లో అమెరికా కేన్సర్‌ ఆస్పత్రి

ప్రపంచస్థాయి క్యాన్సర్‌ దవాఖానను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతో అమెరికా అంకాలజీ నెట్‌వర్క్‌ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషితో బృందం సమావేశమైంది. అమెరికాకు చెందిన క్యాన్సర్‌ దవాఖానను ఏర్పాటుకు ఇప్పటికే ఢిల్లీ, అమృత్‌సర్‌లో పర్యటించిన ఆ బృందం హైదరాబాద్‌కు వచ్చింది. అమెరికాలో ఈ నెట్‌వర్క్‌ సెంటర్లు 140 ఉండగా, వాటిలో 265 మంది వైద్యులున్నారు. అమెరికా క్యాన్సర్‌ దవాఖాన ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, అనుమతులు కూడా సత్వరమే కల్పిస్తామని రాజేందర్‌, వినోద్‌ హామీనిచ్చారు. అనంతరం ఈ బృందం నిమ్స్‌లోని ఆంకాలజీ విభాగాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా వినోద్‌ మాట్లాడుతూ ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు తన ఆహ్వానం మేరకు ఈ బృందం వచ్చిందన్నారు. బృందంలో ఆంకాలజీ నెట్‌వర్క్‌ సీఈవో బ్రాడ్‌ప్రిస్క్‌టిల్‌, సీవోవో టాడ్‌ స్కోన్‌హార్ట్‌, ప్రముఖ ఆంకాలజిస్ట్‌లు రాకేశ్‌ సెహగల్‌, ఉపేందర్‌రావు ఉన్నారు.