కాకినాడలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు

కాకినాడలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు

21-11-2019

కాకినాడలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో టైగర్‌ ట్రయంఫ్‌ పేరిట భారత్‌-అమెరికా త్రివిధ దళాలు నిర్వహిస్తున్న విన్యాసాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రత, ఇతర సహకారం అభినందించదగ్గదని నేవీ రియల్‌ అడ్మిరల్‌ సూరజ్‌ బేరి కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీచ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భీకర యుద్ధాలు, సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలు, సంభవించినపుడు వాటిని ఎలా ఎదుర్కొవాలి, క్షతగాత్రులకు అందించాల్సిన సేవలపై విన్యాసాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈనెల 17వ తేదీ నుంచి టైగర్‌ ట్రయంఫ్‌ పేరుతో ఇండో-అమెరికా సైనికులు నిర్వహిస్తున్న విన్యాసాలు 21వ తేదీ గురువారంతో ముగియనున్నాయన్నారు.