90 మంది భారతీయ విద్యార్థులు అరెస్టు

90 మంది భారతీయ విద్యార్థులు అరెస్టు

28-11-2019

90 మంది భారతీయ విద్యార్థులు అరెస్టు

ఫార్మింగ్‌ టన్‌ నకిలీ యూనివర్సిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. డెట్రాయిట్‌ లోని ఫార్మింగ్‌ టన్‌ ఫేక్‌ యూనివర్సిటీని మూసివేసిన హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు అందులో చేరిన 250 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో 90 మంది భారతీయ విద్యార్థులున్నారని తేలింది. స్టూడెంట్స్‌ అరెస్ట్‌ తో పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్సిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా డెమోక్రటిక్‌ నేతలు అభివర్ణిస్తున్నారు.

గత మార్చి నెలలో యూనివర్సిటీలో 161 మంది అరెస్టు చేశారు. ఆ వర్సిటీని మూసివేసే సమయానికి అందులో 600 విద్యార్థులు చదువుతున్నట్లు తెలిసిందే. దాంట్లో ఎక్కువశాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు.