అమెరికాలో తెలుగు పీఠం (బర్ క్లీ, కాలిఫోర్నియా లో) ఆవశ్యకత....

అమెరికాలో తెలుగు పీఠం (బర్ క్లీ, కాలిఫోర్నియా లో) ఆవశ్యకత....

30-11-2019

అమెరికాలో  తెలుగు పీఠం (బర్ క్లీ, కాలిఫోర్నియా లో) ఆవశ్యకత....

మీ సత్వర సహాయానికి అభ్యర్ధన..
(On or before December 31, 2019) 


క్రిందటి ఏడు ఇదే సమయంలో మా అభ్యర్ధన మన్నించి సుమారు $1
0,000 సమకూర్చి అమెరికాలో తెలుగు పీఠం (బెర్క్ లీ, కాలిఫోర్నియా) బలపడడానికి సహాయ పడిన వదాన్యులకు మరొక సారి మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ సహాయం వలన ఆ పీఠం శాశ్వత నిధి సుమారు $550,00 చేరుకుంది. ఈ ఏడు మనం కనీసం $25,000 సమకూర్చగలిగితే ఆ శాశ్వత నిధిని ఆ విశ్వ విద్యాలయం వారు సముచితమైన పధ్దతిలో పెట్టుబడి పెట్టి ఆ ఆదాయాన్ని తెలుగు పీఠం కోసం వినియోగిస్తారు. ప్రస్తుతం ఆ  తెలుగు పీఠం తన కాళ్ళ మీద తను నిలబడి శాశ్వత ప్రాతిపదిక మీద తెలుగు భాషా బోధన, పరిశోధనలు కొనసాగించే దిశగా పయనిస్తున్నప్పటికీ మీ ఉదార విరాళంతో మరింత ఉన్నత స్థాయికి చేరుతుందనే మా నమ్మకం.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా సేకరించే విరాళాలకి పన్ను రాయితీ (Tax-Deductible) పొందడమే కాకఅమెరికాలో అనేక అంతర్జాతీయ కార్పొరేషన్లు (మైక్రోసాఫ్ట్గూగుల్డెల్షెవ్రాన్ ఆయిల్ కంపెనీబాంక్ ఆఫ్ అమెరికా మొదలైనవి)  మీ విరాళానికి సమతూకంగా తమ విరాళం జతచేస్తాయి. ఆయా కంపెనీల సిధ్ధ్దాంతాలని బట్టి ఇంచుమించు అన్ని కంపెనీల నుంచీ వంగూరి సంస్థ matching funds కి అర్హత కలిగి ఉంది.

ఈ తెలుగు పీఠం వ్యవస్థాపన, విరాళాలు అందించే పూర్తి వివరాలు ఈ పత్రంలో పొందు పరిచాం.   మీరు తిన్నగా ఆ విశ్వవిద్యాలయానికే మీ విరాళం అందజేయడం కూడా స్వాగతిస్తున్నాం.

నేపధ్యం

అమెరికా విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠం నెలకొల్పాలి అనే ఆలోచన ఇప్పటిది కాదు. 1998 లో అట్లాంటాలో జరిగిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో తన కీలకోపన్యాసం లో వెల్చేరు నారాయణ రావు గారు తెలుగు భాష సాహిత్యాలని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం ఇక్కడ విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠాలు నెలకొల్పి ఆయా ఆచార్యులు, అంతర్జాతీయ విద్యార్థుల పరిశోధనల ద్వారా మాత్రమే సాధ్యం అని స్పష్టంగా వివరించారు. డా. గవరసాన సత్యనారాయణ గారు గణాంకాలతో సమగ్రమైన ప్రసంగం చేసి అమెరికాలో విదేశీ భాషగా తెలుగుని గుర్తించడానికి “అమెరికాలో తెలుగు భాష వ్యాప్తి, బోధన, పరిశోధన, ఆధునీకరణలకు వీలుగా తెలుగు పీఠమును స్థాపించ వలయును”  అనే ఏక వాక్య తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని పెమ్మరాజు వేణుగోపాల రావు గారు, వేమూరి వెంకటేశ్వర రావు గారు, వంగూరి చిట్టెన్ రాజు సమర్థించగా “అట్లాంటా తీర్మానము” అనే పేరిట అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఆ నాడు అమెరికాలో తెలుగు పీఠం అవసరం పై చర్చించిన విషయాలు ఇప్పటికీ, ఎప్పటికీ అర్థవంతవయినవి, ఆచరణ లో పెట్ట దగ్గవే. కొంత వరకూ ఆచరణ లోకి వచ్చినవి అన్నీ చాలా మటుకు వ్యక్తిగత ప్రయత్నాలే.

ప్రస్తుత విషయం

ఆ నాటి వేమూరి వేంకటేశ్వర రావు గారు కేవలం మాటలతో కాకుండా చేతలతో అమెరికాలో తెలుగు పీఠం సంస్థాపన లో పదేళ్ళు వ్యక్తిగతంగా, నిస్వార్ధంగా ఎంతో కృషి చేసి 2006 వ సంవత్సరం లో బెర్క్ లీ లో ఉన్న ప్రతిష్టాత్మకమైన కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠాన్ని ఇప్పుడు మరింత పటిష్టమూ, శాశ్వతమూ చెయ్యవలసిన కర్తవ్యం నాదీ, మీదీ, మన తెలుగు శాఖని అభివృద్ది పరిచే విషయం మీద ఆ విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ అంతర్భాగం గా ఉన్న South Eastern & South Asia విభాగం ప్రొ. సంచిత సక్సేనా మరియు డైరెక్టర్ ప్రొఫెసర్ మారిస్ ఫరుకీ లతో నేను స్వయంగా కూలంకషంగా చర్చించాను.  సంక్షిప్తంగా చెప్పాలంటే ఇప్పటి దాకా డా. వేమూరి గారి ఏకైక అకుంఠిత దీక్ష వలన ఈ క్రింది విజయాలు సమకూరాయి.

  • 2006 నుంచి అమెరికాలో, బర్^క్లీ లో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గత పదేళ్లుగా తెలుగు భాషా బోధన - సగటున, ఏడాదికి రెండు పాఠ్యాంశాలు చొప్పున -జరుగుతోంది. ఒకటి ప్రారంభ తరగతులు. రెండోది మధ్య తరగతులు.
  • తెలుగులో పరిశోధన నిమిత్తంTELSA (దక్షిణ కేలిఫోర్నియాలో ఉన్న ఒక తెలుగు సంఘం) వారు ఇచ్చిన $50,000 తో  విద్యార్థి వేతనం కూడా గత ఏడాది నుండి మొదలు అయింది. ఇది కేవలం ఓనమాలు నేర్పించడం కోసం తలపెట్టిన పీఠం కాదు. ఇది కేవలం బర్కలీ ప్రాంగణానికి పరిమితం చెయ్యాలని  తలపెట్టిన పీఠమూ  కాదు. 
  • సంస్కృతంలోపి. హెచ్. డి పట్టా కోసం ప్రయత్నం చేస్తూన్న  జానెట్ అం అనే అమ్మాయి తెలుగులో పరిశోధనాంశంగా కేతన రాసిన దశకుమార చరితం అధ్యయనం చెయ్యడానికి మన తెలుగు పీఠం సావకాశం కల్పించింది. ఈ ప్రయత్నంలో ద్రావిడ విశ్వవిద్యాలపు విశ్రాంత ఉపకులపతి ఆచార్య గంగిసెట్టి లక్ష్మీనారాయణ గారు పర్యవేక్షణ చెయ్యడంతో తెలుగు దేశానికీ మన పీఠానికీ ఒక లంకె ఏర్పడింది!
  • ఈ పీఠం ఈరోజు ఉండి, రేపు మూత పడిపోయే వానకాలపు పీఠం కాదు; సుస్థిరంగా, శాశ్వతంగా నిలవగలిగే స్తోమత సంపాదించుకున్న  పీఠం. ఇది తెలుగువారు అంతా కలిసి, ఉడతా భక్తితో, చిన్నా, పెద్దా విరాళాలు ఇచ్చి నిలబెడుతున్న పీఠం! ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు.
  • వేమూరి గారి నాయకత్వంలో ధన సేకరణ2006 లో మొదలయింది. అనేక ప్రాంతాల నుండి మిత్రులు నిధులు పోగు చేసి పంపుతూనే ఉన్నారు. ఇప్పటికి $680,000 వరకునిధుల పోగు చెయ్యడం జరిగింది. ఖర్చులు పోను ప్రస్తుతం శాశ్వత నిధిలో సుమారు $550,000 ఉన్నాయి. 

మీకు ప్రత్యేక అత్యవసర విన్నపం

బెర్క్ లీ లో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో ఉన్న తెలుగు పీఠం నిర్వాహకుల నిర్దేశం ప్రకారం ఇప్పుడు ఉన్న సుమారు $550,000 నిదులకి మనం కేవలం మరొక $25000 జమ చెయ్యగలిగితే ఆ పీఠానికి మరింత బలం చేకూరుతుంది. ఆ విశ్వ విద్యాలయం ఉన్నన్నాళ్లూ....అంటే వందల సంవత్సరాలు ..అమెరికాలో భావి తరాల తెలుగుతెలుగేతర విద్యార్థులకీ అక్కడ తెలుగు భాషా బోధన నిరాటంకం గా సాగుతుంది.

Donor Recognition by U C, Berkeley

(దాతల గుర్తింపు)

The University has different levels of recognizing donor contributions from very small amount to substantial amounts. The University has well-established Donor Recognition policies. Please contact one of us for details.

One of the most popular categories is a special recognition on its web page by South East & South Asian Department for all donors of $5000 or more payable over several years. We strongly encourage your participation in this plan. Again, no amount is too small. 

If you give $5,000 or more, your name will be acknowledged on the following website: 

https://southasia.berkeley.edu/acknowledgements

Suggested Donation Amounts for 2019
$100 to $25,000

How to Donate

Suggested Option 1

(All donations through VFA are tax-deductible in USA.
Federal Tax ID: 76-044238)

(All donations may qualify for matching funds by your employer)

How this works

You send your donation in any amount on-line or by check as given below. In addition, as VFA is qualified to receive matching donations from many companies and you can also apply for a matching donation from your employer.

 VFA will send your contribution & your company match to UC Berkeley Foundation for Telugu Studies in YOUR name.

You will get a receipt from UC, Berkeley and will be recognized by UC per their policies (attached) and by VFA in its communications on FB and Google member group.   

Donation through VFA on-line using any credit card

Please click on the following link and donate generously using any credit card.

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=3R29K3F2QREMQ&source=url

or

make check payable to Vanguri Foundation of America, Inc. and mail to:

VFA, P.O. Box 1948, Stafford, TX 77497 

Suggested Option 2

Donate Direct to UC, Berkeley Foundation

You can donate online directly to University of California, Berkeley by clicking on the following link

https://givetocal.berkeley.edu/egiving/index.cfm?Fund=FW4022000


Please donate generously to support Telugu Studies at the prestigious University of California, Berkeley.

For More Details, Please contact the following:

Prof. Rao Vemuri 
Phone: 925-846-5590: E-mail:  rvemuri@gmail.com

Vanguri Chitten Raju
Phone: 832 594 9054' E-mail: vangurifoundation@gmail.com

ఎందరో తెలుగు విద్యాదాన కర్ణులు.. అందరికి వందనాలు!!