తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

30-11-2019

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి రాబోతున్నది. ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీలో దిగ్గజమైన స్కైవర్త్‌ తన ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రాష్ట్రానికి ఎంచుకుంది. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో స్కైవర్త్‌ గ్రూప్‌ బోర్డు చైర్మన్‌ లై వీడ్‌ భేటీ కావడం జరిగింది. రాష్ట్రంలో తమ ఉత్పత్తులకు సంబంధించి స్కైవర్త్‌ లీడర్‌షిప్‌ యొక్క ఉన్నత ప్రతినిది బృందం, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో స్కైవర్త్‌ గ్రూప్‌ బోర్డు చైర్మన్‌ మిస్టర్‌ లై వీడ్‌ తెలంగాణ ప్రభుత్వతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. స్కైవర్త్‌ కంపెనీ తెలంగాణలో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దశల వారీగా పెట్టుబడులను పెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో హైదరాబాద్‌ కేంద్రంగా రూ.700 కోట్లతో 50 ఎకరాలలో అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయబోతుంది.

రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ రంగ పెట్టుబడి ఇది. దీంతోపాటు దేశంలోకి వచ్చిన అతిపెద్ద చైనీస్‌ ఎలక్ట్రానిక్స్‌ పెట్టుబడుల్లో ఇది ఒకటిగా నిలవనున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్‌ మెట్జ్‌ బ్రాండ్‌ ఎల్‌ఈడీ టీవీలు ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్నాయి. దాని రెండవ దశ విస్తరణలో ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే తాజా తరం లిథియం బ్యాటరీల తయారీ, ఎయిర్‌ కండిషనర్లు, రిఫిజ్రిరేటర్లు మరియు వాషింగ్‌ మెషీన్ల తయారీని చేర్చడం జరుగుతుంది.