7.17 కోట్లు ధర పలుకుతున్న డాలర్‌ కుర్చీ

7.17 కోట్లు ధర పలుకుతున్న డాలర్‌ కుర్చీ

02-12-2019

7.17 కోట్లు ధర పలుకుతున్న డాలర్‌ కుర్చీ

రష్యాలోని కొందరు ఔత్సాహికులు డాలర్‌ కరెన్సీ నోట్ల కట్టలతో కుర్చీని తయారు చేసి ఒక ప్రత్యేక ప్రదర్శనలో ఉంచారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకర్షించింది. ఔత్సాహికులు ఈ కూర్చీని వేలానికి కూడా పెట్టారు. అయితే వీటిధర మాత్రం మామూలుగా లేదు. 7.17 కోట్లు వెచ్చించి కొనాల్సిందే. గాజుపలకలతో ప్రేమ్‌ తయారుచేసి వాటిమధ్య డాలర్ల కట్టలు ఉంచారు. అందువల్లనే ఈకుర్చీకి అంత ఖరీదని తేలింది. ఈ కుర్చీని కొనేందుకు అందరు ఉత్సాహం చూపిస్తున్నా ధరను చూసి గతుక్కమంటున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుందనడానికి ఈ కుర్చీయే ఉదాహరణ. కొందరు ఒళ్లంతా బంగారు దిగేసుకుంటారు. మరికొందరు అత్యంత విలాసవంతమైన ఉత్పత్తులు కొనుగోలు చేసారు. కొందరు వాహనాల బాడీని విచిత్రంగా రూపొదందిస్తారు. ఇపుడు మాస్కోలో ఔత్సాహికులు డారల్‌ కుర్చీని తయరు చేసారు.