యూఎస్‌ మార్కెట్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

యూఎస్‌ మార్కెట్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

07-12-2019

యూఎస్‌ మార్కెట్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అమెరికా విపణిలో డెఫెరసిరాక్స్‌ ఫిల్మ్‌ కోటెడ్‌ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది నొవార్టిస్‌ ఏజీ అనే బహుళ జాతి సంస్థ విక్రయిస్తున్న ఎగ్జేడ్‌ ట్యాబ్లెట్‌కి జనరిక్‌ ఔషధం. ఇక్వియా హెల్త్‌ గణాంకాల ప్రకారం ఈ ఔషధానికి అమెరికాలో గత ఏడాది కాలంలో దాదాపు 113 మిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రానిక్‌ ఐరన్‌ ఓవర్‌లోడ్‌ లక్షణాలతో బాధపడే వారికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.