మధుమేహానికి మందులక్కర్లేదు...

మధుమేహానికి మందులక్కర్లేదు...

09-12-2019

మధుమేహానికి మందులక్కర్లేదు...

జీవ గడియారానికి అనుగుణంగా ఆహారం తీసుకుంటే మధుమేహ బాధితులు మందులు వాడాల్సిన పనే ఉండదు. ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు అని ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. రోజూ ఉదయం పిండి పదార్థాలతో కూడిన అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు.. నిద్రపోయే ముందు కొద్దిపాటి అల్పాహారం తీసుకుంటే రక్తంలో చక్కెర మోతాదు అదుపులోకి వస్తుందని అధ్యయనంలో గుర్తించారు. ఇన్సులిన్‌ ఇంజెక్షన్ల వల్ల సాధారణంగా శరీర బరువు పెరుగుతుంటుంది. ఆ విపరీత పరిస్థితికి బ్రేక్‌ పడాలంటే పిండిపదార్థాలతో కూడిన అల్ఫాహారం తీసుకోవడం తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు.