ఈ బిల్లును ఖండించే అధికారం అమెరికాకు లేదు

ఈ బిల్లును ఖండించే అధికారం అమెరికాకు లేదు

11-12-2019

ఈ బిల్లును ఖండించే అధికారం అమెరికాకు లేదు

పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) చేసిన ప్రకటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ బిల్లును తప్పుడు దిశలో వెళ్తున్న ప్రమాదకరమైన మలుపుగా అభివర్ణిస్తూ యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమనీ, ఈ బిల్లును ఖండించే అధికారం దానికి లేదని సృష్టం చేసింది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై, ఇతర కీలక నాయకులపై అమెరికా ఆంక్షలు విధించాలని కూడా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ సూచించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందించారు. ఒక విషయం పట్ల ముందే ప్రతికూలాభిప్రాయం ఏర్పరచుకొని మాట్లాడడం విచారకరం అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్‌)తో గానీ, జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) ప్రక్రియతో గానీ ఏ ఒక్క భారతీయుడి పౌరసత్వానికీ ముప్పులేదు. దీనిపై వ్యక్తమవుతున్న ఆందోళనలో ఎలాంటి అర్థం లేదు. అమెరికాతో సహా ప్రతి దేశానికి తమ పౌరులను లెక్కించి, పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఉంది అని రవీశ్‌ సృష్టం చేశారు.