డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ల మధ్య మళ్లీ యుద్ధం

డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ల మధ్య మళ్లీ యుద్ధం

11-12-2019

డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ల మధ్య మళ్లీ యుద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య మాటల యుద్దం మళ్లీ ప్రారంభమైంది. ఉత్తర కొరియా ఇటీవల నిర్వహించిన కీలక ఆయుధ పరీక్షపై ట్రంప్‌ పరోక్ష హెచ్చరికలు చేసిన నేపధ్యంలో ఆ దేశం దీటుగా బదులిచ్చింది. ట్రంప్‌ ఆలోచనలు లేని, వృద్ధుడు అంటూ విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా సీనియర్‌ అధికారి కిమ్‌ యోంగ్‌ చోల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. యూఎస్‌ ఒత్తిళ్లకు తమ దేశం తలొగ్గదని చెప్పారు. అణ్వస్త్ర చర్చలకు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ట్రంప్‌ ప్రభుత్వం ఒత్తిళ్లకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఈ ఒప్పందానికి పరస్పర అంగీకారం కోసం ఈ ఏడాది చివరి ఒరకు ఒక గడువు విధించారు.

ఇటీవల ఒక కీలక ప్రయోగం చేశామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రకటించారు. దీనిపై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధాన్ని కిమ్‌ రద్దు చేసుకోరనే అనుకుంటున్నా అని పరోక్షంగా హెచ్చరించారు.