నోబెల్‌ బహుమతిని అందుకున్న భారతీయ అమెరికన్‌

నోబెల్‌ బహుమతిని అందుకున్న భారతీయ అమెరికన్‌

11-12-2019

నోబెల్‌ బహుమతిని అందుకున్న భారతీయ అమెరికన్‌

 స్వీడన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ రాజు కారల్‌ గుస్టాఫ్‌ నుంచి ప్రముఖ భారతీయ అమెరికన్‌ ఆర్థికవేత్త అభిజిత్‌ బెనర్జీ అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్నారు. మరోవైపు నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన కార్యక్రమంలో ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్‌ అహ్మద్‌ నోబెల్‌ శాంతి బహుమతిని స్వీకరించారు. ఎరిట్రియాతో సరిహద్దు ఘర్షణలను నివారించేందుకు చేసిన కృషిగాను ఆయనకు ఈ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.