గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి...

గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి...

11-12-2019

గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి...

గ్రేటర్‌ అట్లాంటా తెలుగు అసోసియేషన్‌(గాటా) 10వ చీఫ్‌ కోఆర్డినేటర్‌గా సాయి గొర్రెపాటి ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 8న జరిగిన గ్రేటర్‌ అట్లాంటా తెలుగు అసోసియేషన్‌ వ్వవస్థాపక సభ్యులు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సమావేశాన్ని నిర్వహించి ఆయనను గాటా చీఫ్‌ కో ఆర్డినేటర్‌గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గాటా వ్యవస్థాపకులు తంగిరాల సత్యనారాయణ రెడ్డి, గిరీష్‌ మేక, సత్య కర్నాటి మాట్లాడుతూ.. గాటా గత 10 సంవత్సరాలుగా చేసిన వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ఇక చీఫ్‌ కోఆర్డినేటర్‌ సాయి గొర్రెపాటి మాట్లాడుతూ.. 10వ వార్షికోత్సవంను పురస్కరించుకుని నిర్వహించనున్న వివిధ సాంస్కతిక కార్యక్రమాలను తెలియజేశారు. అట్లాంటాలోని ఇన్ఫినిటీ ఎనర్జీ సెంటర్‌లో వచ్చే ఏడాది మే 29,30 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న తెలుగు వారందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. గాటా నిర్వహకులు గౌతమ్‌ గోలి, కిరణ్‌ పాశం, రవి కందిమళ్ళ, అరుణ్‌ కాట్పల్లి, తదితరులు సాయి గొర్రెపాటికి శుభకాంక్షలు తెలుపుతూ గాటా కన్వెన్షన్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.