ఎపిఇడిబి ప్రత్యేక ప్రతినిధిగా ప్రతాప్‌ భీమ్‌రెడ్డి

ఎపిఇడిబి ప్రత్యేక ప్రతినిధిగా ప్రతాప్‌ భీమ్‌రెడ్డి

11-12-2019

ఎపిఇడిబి ప్రత్యేక ప్రతినిధిగా ప్రతాప్‌ భీమ్‌రెడ్డి

ప్రముఖ ఐటీ, ఫార్మా కంపెనీల వ్యవస్థాపకులు, ఎన్నారై, నాటా బోర్డు సభ్యులు శ్రీ ప్రతాప్‌ భీమ్‌ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్య పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ప్రోత్సాహకాల వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకం పట్ల పలువురు ఎన్నారైలు అభినందనలు వ్యక్తం చేశారు. ప్రతాప్‌ భీమ్‌రెడ్డి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఇన్‌స్యూరెన్స్‌ ఇండస్ట్రీలలో పనిచేసిన అనుభవం, తెలుగు కమ్యూనిటీతో ఆయనకు ఉన్న అనుబంధం ఆయనకు ఈ పదవిని వరించేలా చేసింది.