రత్నాకర్ ని సన్మానించిన ఆప్కో

రత్నాకర్ ని సన్మానించిన ఆప్కో

12-12-2019

రత్నాకర్ ని సన్మానించిన ఆప్కో

ఆంధ్ర పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో (APCO - ఆప్కో) సంస్థ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ స్పెషల్ రిప్రెసెంటేటివ్ టు నార్త్ అమెరికా (APGSRNA) గా నియమితులైన  పండుగాయల రత్నాకర్ ని ప్రత్యేకంగా సన్మానించింది. రత్నాకర్ ఇటీవల తన అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో పర్యటించిన సందర్భంగా APCO సంస్థ ప్రతినిధులు ఆయనను కలిసి అభినందించటంతో పాటు ఒక జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ఆప్కో ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని ప్రతినబూనారు. దీనిపై తన ఆనందాన్ని వ్యక్తపరిచిన రత్నాకర్  వారిని అభినందిస్తూ వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా ప్రభుత్వం తరపున సహాయపడతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆప్కో తరపున సంస్థ వ్యవస్థాపక సభ్యులైన వేణు తలశిల, నాగేశ్వరరావు మన్నే తో పాటు సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీధర్ వేగేసన, ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు యిరుకులపాటి, కోశాధికారి వెంకట్ అరవీటి మరియు సంయుక్త కార్యదర్శి రవిప్రసాద్ నవులూరి పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో నాగేశ్వరరావు మన్నే ఆప్కో సంస్థ ప్రాశస్త్యాన్ని సభికులకు వివరించారు. తదనంతరం వేణు తలశిల గారు శాలువాతో రత్నాకర్ ని సన్మానించగా, శ్రీధర్ వేగేసన రత్నాకర్ కి జ్ఞాపికను బహుకరించారు. అంతకు ముందు పూర్ణచంద్రరావు యిరుకులపాటి రత్నాకర్ కి పుష్పగుచ్చాన్ని బహూకరించి వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. చివరిగా ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ టి.పి. రెడ్డి కి ఆప్కో ప్రతినిధులంతా ధన్యవాదాలు తెలిపారు.

Click here for Photogallery