గొల్లపూడి మృతి పట్ల నాట్స్ దిగ్భ్రాంతి

గొల్లపూడి మృతి పట్ల నాట్స్ దిగ్భ్రాంతి

14-12-2019

గొల్లపూడి మృతి పట్ల నాట్స్ దిగ్భ్రాంతి

ప్రముఖ తెలుగు సినీ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని, రచయితను కోల్పోయిందని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు ప్రజల గుండెల్లో తన నటన ద్వారా రచనల ద్వారా గొల్లపూడి సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పేర్కొంది. అమెరికాలో ఉండే తెలుగు ప్రజలు  గొల్లపూడి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారని పేర్కొంది. తెలుగుభాషకు కూడా గొల్లపూడి ఎనలేని సేవలు చేశారని తెలిపింది. గొల్లపూడి కుటుంబసభ్యులకు నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేసింది.