సంస్కరణ -పరిరక్షణ నేడు అవసరం - గోగినేని
Telangana Tourism
Vasavi Group
Manjeera Monarch

సంస్కరణ -పరిరక్షణ నేడు అవసరం - గోగినేని

18-03-2017

సంస్కరణ -పరిరక్షణ నేడు అవసరం - గోగినేని

స్వప్రయోజనం, ధనస్వామ్యం, భజనపరత్వంతో  తానా పరిపాలన సాగుతోందని దీనిని మార్చాల్సి ఉందని తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవికి పోటీ పడుతున్న శ్రీనివాస గోగినేని అన్నారు. నూతన సంస్కరణలు,  విలువల పరిరక్షణలే ప్రథమ ప్రాధాన్య అవసరాలని ఆయన పేర్కొన్నారు. ఇర్వింగ్‌లోని ఓ హోటల్‌లో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన  తానా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తానాలో సుదీర్ఘంగా సేవలందించి వివిధ పదవులను అలంకరించిన తనకు సంస్థ పరిపాలన విభాగ లోటుపాట్లన్నీ క్షుణ్ణంగా తెలుసునని అందుకే సంస్థ పురోగతికి నూతన విధివిధానాల ఆవశ్యకత అధికంగా ఉందని పేర్కొన్నారు.

తనకు నాయకత్వ లక్షణాలు లేవని, నలుగురిని కలుపుకుపోవడం చేతగాదని ప్రత్యర్థులు సంధిస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు. 2015 డెట్రాయిట్‌ మహాసభలు, తానా ఫౌండేషన్‌ కార్యకలాపాలు విస్తరించడం, అమెరికా వ్యాప్తంగా 5కె రన్‌ ద్వారా స్వగ్రామాల్లో ప్రవాసుల సమకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలే తనలోని నాయకత్వ లక్షణాలకు ప్రతీకలని పేర్కొన్నారు. సభ్యుల చేరికలో పలు అవకతవకలు జరిగాయని వాటిని ఆసాంతం శుద్ధి చేసే కార్యక్రమానికి తొలుత శ్రీకారం చుట్టింది తానేనని తెలిపారు. తాతినేని రామ్‌ వ్యాఖ్యానంతో సాగిన ఈ కార్యక్రమంలో టాంటెక్స్‌ మాజీ అధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్బు, ఏకగ్రీవంగా ఎన్నికైన తానా ప్రాంతీయ ప్రతినిధి చాగర్లమూడి సుగన్‌, కేసీ చేకూరి తదితరులు ప్రసంగించారు. అధికసంఖ్యలో యువత పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు తుమ్మల శ్రీధర్‌, విజయ్‌ బొర్రా, సుదనగుంట రాఘవేంద్ర ప్రసాద్‌, పోలవరపు శ్రీకాంత్‌, అనంత్‌ మల్లవరపు, చలసాని కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.